విశాఖపట్నం

విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ లో రెండవ అతిపెద్ద నగరం, భారతదేశం యొక్క ఒక ప్రధాన సముద్ర రేవు. అయితే, ఇటీవల ప్రకటించింది తెలంగాణ రాష్ట్రం తో, విశాఖపట్నం ఆంధ్రా ప్రదేశ్ అతిపెద్ద నగరం, ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు రాష్ట్ర సరియైన కాపిటల్ ఉంటుంది. ఇక్కడ వాతావరణం ఉష్ణమండలం, ఆర్ద్రత ఏడాది పొడవునా అధికంగా ఉంది. నగరం భారతదేశంలో గొప్ప దర్శనీయ స్థలాలలో ఒకటి చేయడానికి అవసరమైన అన్ని ఆకర్షణలు, వనరులను కలిగి ఉంది. దీని వివిధ బీచ్లు, కొండ, ఒక వన్యప్రాణి అభయారణ్యం ఒక ప్రధాన పర్యాటక గుంపు ఆకర్షించడానికి. స్థలం ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రధాన ఓడరేవుగా, భారతదేశం యొక్క లోతైన పోర్ట్సు ఉంది. విహార సుందరమైన ఉంది, కొన్ని గొప్ప ట్రెక్కింగ్ ప్రదేశాల్ని గల ఒక కొండ స్టేషన్ ఏ అరకు వ్యాలీ, వంటి వివిధ లోయలు ఉన్నాయి. యారాడ, రిషికొండ వంటి వివిధ బీచ్లు అత్యంత సుందరమైన ప్రదేశాలలో కొన్ని వుండి చాలా శుభ్రంగా, క్రింద విశాఖ ప్రధాన పర్యాటక ఆకర్షణలు అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి:

  1. విశాఖపట్నం
  2. బొర్రా గుహలు
  3. అరకు లోయ
  4. లంబసింగి (దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు.)
  5. యారాడ బీచ్
  6. రుషికొండ బీచ్
  7. కటికి జలపాతం.
  8. ఇందిరా మహాత్మా గాంధీ జూలాజికల్ పార్క్
  9. కైలాసగిరి హిల్ పార్క్
  10. ఉడా పార్క్
  11. భీమునిపట్నం బీచ్
1. విశాఖపట్నం: -
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం, వైజాగ్‌, వాల్తేర్) భారత దేశంలోని పెద్ద నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది.

సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. విశాఖపట్నం రేవు సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రం లోకి చొచ్చుకొని ఉన్న కొండ "డాల్ఫిన్స్‌ నోస్‌" అలల తాకిడిని తగ్గించే పనిచేస్తుంది.

రవాణా సౌకర్యాలు:-  రోడ్డు మార్గం
చెన్నై-కోల్‌కతా లను కలుపు 16 వ నంబరు జాతీయ రహదారి, విశాఖపట్నం-రాయపూర్ లను కలుపు 26 వ నంబరు జాతీయ రహదారి విశాఖను దేశం లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి.

విశాఖపట్నం లోని ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చే నిర్వహించబడు ద్వారకా బస్సు స్టేషన్ కాంప్లెక్స్ నుండి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు (చెన్నై), కర్ణాటక (బెంగళూరు) రాష్ట్రాలకు అంతరాష్ట్ర సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రం లోకి అన్ని ప్రాంతాలకు ఈ బస్సు స్టేషన్ నుండి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మద్దిలపాలెం,అనకాపల్లి బస్ స్టేషన్ ల నుండి కూడా సర్వీసులు నడుపబడతాయి.

విశాఖపట్నం నగరంలోని నగర బస్సులు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి వారి అజమాయిషీలో నడుపుతున్నారు. నగరం లోని దాదాపు అన్ని ప్రాంతాలకు సిటీబస్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి.విశాఖ నగరంలో సింహాచలం,గాజువాక,ఉక్కునగరం,పాత పోస్టాఫీసు,మద్దిలపాలెం,మధురవాడ,వాల్తేరు, కుర్మన్నపాలెం,అనకాపల్లి వంటి ప్రాంతాలలో సిటీ బస్సు డిపోలు ఉన్నాయి తగరపువలసలో కూడా డిపో ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి.ఈ డిపోల నుండి సిటీ ఆర్డినరీ,మెట్రో షట్టిల్స్,మెట్రో లగ్జరీ వంటి బస్ లు సేవలు అందిస్తున్నాయి. అంతే కాకుండా నగరం నుండి విజయనగరం,శ్రీకాకుళం డిపో లకు కూడా మెట్రో లగ్జరీ సిటీ బస్ లు సేవలు అందిస్తున్నాయి.అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి శీఘ్రవంతమైన ప్రజా రవాణా కొరకు బి.అర్.టి.ఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి గ్రేటర్ విశాఖ, రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అత్యంత ముఖ్యమైన ఎన్.ఏ.డీ కూడలి వద్ద ప్లైఓవర్ బ్రిడ్జిను నిర్మిస్తున్నారు.అలాగే హనుమంతవాక కూడలి,గాజువాక కూడళ్ళ వద్ద కూడా ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి సిటీ బస్సులు మాత్రమే కాక అగ్రిగేటర్స్ అయినా ఉబెర్, ఓలా సంస్థలు, ఇతర స్థానిక ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహించే క్యాబ్ సేవలు, ఆటోలు స్థానిక రవాణా కొరకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మోటారు సైకిళ్ళు, కార్లు అద్దెకు ఇచ్చే సంస్థలు కూడా నగరంలో అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం: -
దేశంలో నాల్గవ అత్యధిక ఆదాయం కలిగిన వాల్తేరు డివిజన్ ప్రధాన కేంద్రం విశాఖ పట్నంలో ఏర్పాటు చేయబడింది.

హౌరా - చెన్నై రైలు మార్గంలో విశాఖపట్నం జంక్షన్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్. దేశంలో దాదాపు అనేక ప్రాంతాలకు ఇక్కడి నుండి ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్ కాకుండా దువ్వాడ, అనకాపల్లి రైల్వే స్టేషన్ లలో కూడా అనేక ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుస్తాయి. సింహాచలం రైల్వే స్టేషన్ లో కూడా కొన్ని ఎక్ప్ ప్రెస్ రైళ్లు, పాసెంజర్ రైళ్లు నిలుస్తాయి. ఇవి కాకుండా మర్రిపాలెం, పెందుర్తి, తాడి వంటి చిన్న రైల్వే స్టేషన్లు నగరంలో ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్ పై వత్తిడి తగ్గించుటకు కొన్ని రైళ్లు దువ్వాడ సింహాచలం మీదుగా మళ్లించటం జరుగుతోంది.

జోధ్ పూర్, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, గుంటూరు, కొల్లం, షిర్డీ, ముంబయి, కోరాపుట్, తిరుపతి, భువనేశ్వర్, గాంధీ ధామ్, కోలకతా, దీఘా, టాటా నగర్, చెన్నై, నరసాపురం, మచిలీపట్టణం, కోర్బా, నాందేడ్, కిరండూల్, పారాదీప్ నగరాలకు ఎక్స్ ప్రెస్ రైళ్లు రాయపూర్, గుణుపూర్, కిరండూల్, కోరాపుట్, శ్రీకాకుళం రోడ్, అరకు, విజయవాడ, బరంపూర్, రాయగడ, కాకినాడ, విజయనగరం, రాజమహేంద్రవరం, పలాస, దుర్గ్ నగరాలకు పాసెంజర్ రైళ్లు విశాఖపట్నం స్టేషన్ నుండి ప్రారంభం అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే నుండి వాల్తేర్ డివిజన్ ని, దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ ల కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ లోని ఒడిశా భాగాలూ నూతనంగా ఏర్పాటు చేయబడు రాయగడ డివిజన్ లో భాగం కానున్నాయి. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లోని మిగిలిన భాగాలు విజయవాడ డివిజన్ లో విలీనం చేసేలా సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వాయు మార్గం: -
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఇండిగో, స్కూట్ స్పైస్ జెట్,సిల్క్ ఏర్వేస్, శ్రీలంక ఏర్ వేస్ వంటి విమానయాన సంస్థలు కౌలాలంపూర్ దుబాయ్, సింగపూర్,శ్రీలంక వంటి దేశాలకు అంతర్జాతీయ సర్వీస్ లు, దేశీయంగా బెంగళూరు, కోలకతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబాయి, పోర్ట్ బ్లెయిర్, విజయవాడ, చెన్నై, రాజమహేంద్రవరం, వారణాసి నగరాలకు విమాన సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇక్కడనుండి కార్గో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యం కొరకు టెర్మినల్ భవనాన్ని విస్తరిస్తున్నారు

ఇది నౌకాదళం అధీనంలో నడిచే విమానాశ్రయం. ఇందులోనే ఐ.ఎన్.ఎస్. డేగ పేరుతో నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తుంటాయి. ఇది పౌరులకు నిషిద్ధ ప్రాంతం.

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భోగాపురంలో ఆధునిక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

రుషి కొండలో నగర విహంగ వీక్షణం కొరకు సెలవుదినాలలో, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో హెలికాప్టర్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది.

------------------------------------------------------------------------------------------------------------------------